SBI super hit scheme: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో సేవలు అందిస్తోంది. ఈ సేవల వలన చాలామంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు రిస్క్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. స్థిరంగా సురక్షితమైన ఆదాయం అందించే మార్గాల కోసం చూస్తారు. ఇలాంటి వారి కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అధిక రిటర్న్స్ వస్తాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ స్కీం ని తీసుకువచ్చింది. ఈ స్కీంలో డబ్బులు పెట్టడం వలన అధిక రాబడి వస్తుంది.
ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల పాటు డబ్బులు డిపాజిట్ చేయడానికి అవుతుంది. ఏడాదికి ఎస్బీఐ సూపర్ హిట్ స్కీం లో 10 లక్షలు డిపాజిట్ చేస్తే 6.80% వడ్డీ అందుతుంది సంవత్సరం చివర్లో 69,753 రూపాయలు వస్తాయి. మెచ్యూరిటీ మొత్తం రూ.10,69,753 వస్తుంది. రెండేళ్ల పాటు ఫిక్స్ డిపాజిట్ చేస్తే ఏడు శాతం వడ్డీ వస్తుంది. రూ.10 లక్షలకు మీరు రూ.1,48,881 వడ్డీని పొందుతారు.
2 సంవత్సరాల తర్వాత మీ మెచ్యూరిటీ మొత్తం రూ.11,48,881 అవుతుంది. అదే ఐదేళ్లకు చూస్తే 6.50% వడ్డీ రేటు లభిస్తుంది. రూ.10 లక్షల డిపాజిట్‌పై మీరు రూ.3,80,419 వడ్డీని పొందుతారు. ఫలితంగా 5 సంవత్సరాల తర్వాత మొత్తం మెచ్యూరిటీ రూ.13,80,419 అవుతుంది. ఈ స్కీముపై సీనియర్ సిటిజన్లకు 0.50% ఎక్కువ వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్ 5 సంవత్సరాలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.4,49,948 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ మొత్తం రూ.14,49,948 అవుతుంది.