అన్నదాతలకు శుభవార్త… ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.3 వేలు..!

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వీటిలో పలు స్కీమ్స్ ని రైతుల కోసం తీసుకు వచ్చారు. రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి. దీని వలన అదిరే లాభాలు రైతులు పొందొచ్చు. ప్రతీ నెలా డబ్బులు వస్తాయి కనుక రైతులకి లాభదాయకంగా ఉంటుంది.

 

farmers

ఇది ఇలా ఉంటే ఈ పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరితే అన్నదాతలకు మూడు వేల రూపాయిల పెన్షన్ ని పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాతనే ఈ డబ్బులు వస్తాయి. ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.3 వేలు పొందొచ్చు. దీని కోసం మీరు ముందుగానే ప్రతి నెలా కొంత డబ్బు కడుతూ వెళ్లాలి. ఈ స్కీమ్ లో భాగంగా నెలకి రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్కీమ్ నుంచి వైదొలిగితే చెల్లించిన డబ్బులు వస్తాయి.

ఒకవేళ స్కీమ్ లో చేరిన వాళ్ళు కనుక మరణిస్తే భాగస్వామికి ప్రతి నెలా రూ.1500 లభిస్తాయి. అయితే ఈ స్కీమ్ లో చేరడానికి 18 నుంచి 40 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులు. స్కీమ్‌ లో చేరిన దగ్గరి నుంచి మీకు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. 18 ఏళ్లలోనే స్కీమ్‌ లో చేరితే నెలకు రూ.55 కట్టాలి. అదే 30 ఏళ్లలో చేరితే రూ.110 చెల్లించాలి. 40 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.200 కట్టాలి. ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హులైన రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయిలు పొందుతున్న సంగతి తెలిసిందే.