ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. ఈ స్కీమ్స్ బెస్ట్..!

-

కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్స్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. భవిష్యత్తు లో ఇబ్బందులు ఏమి లేకుండా ఉండాలంటే ఇలాంటి స్కీమ్స్ లో డబ్బులు పెట్టాల్సి వుంది. ఆడపిల్లల కోసం కేంద్రం కొన్ని స్కీమ్స్ ని తెచ్చింది. ఇక మరి ఈ స్కీమ్స్ వలన కలిగే లాభాల గురించి వాటి వివరాల గురించి ఇప్పుడు చూసేద్దాం.

చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్:

ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు. ఆడ పిల్లల ఉద్దేశించే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ రుణ పరిమితులను కలిగి వుంది. పిల్లల పేరు మీద ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు.

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్:

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా మంచి స్కీమ్ ఏ. ఈ అకౌంట్ ని ఆడపిల్లను కలిగిన ప్రతి తల్లిదం‍డ్రులు ఓపెన్ చెయ్యచ్చు. 10 ఏళ్ల లోపు వయసున్న పిల్లల పేరు మీద ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. 15 సంవత్సరాలపాటు పే చెయ్యాల్సి ఉంటుంది. ప్రస్తుతం 7.6 శాతం వడ్డీని ఇస్తున్నారు. కనీసం రూ. 250 నుంచి దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు.
గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్ష వరకూ పెట్టుబడి పెట్టచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ :

బాలికల భవిష్యత్‌ అవసరాలకు ఈ స్కీమ్ బాగా ఉపయోగ పడుతుంది. సురక్షిత పెట్టుబడి పథకం ఇది. దీనిని పోస్టాఫీసులలో మీరు తీసుకోవచ్చు.

పోస్ట్-ఆఫీస్ టర్మ్ డిపాజిట్:

పోస్ట్-ఆఫీస్ టర్మ్ డిపాజిట్ కూడా బాలికల భవిష్యత్‌ అవసరాలు తీర్చడానికి ఉపయోగ పడుతుంది. ఇందులో ఎవరైనా ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధి తో పెట్టుబడి పెట్టొచ్చు.

CBSE ఉడాన్ స్కీమ్:

ఇక ఈ స్కీమ్ విషయానికి వస్తే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దీన్ని తీసుకు వచ్చింది. బాలికలకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విద్యా సౌకర్యాలను అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news