మహిళలకు గుడ్ న్యూస్..ఉచిత కుట్టు మిషన్లు అందిస్తున్న మోదీ..వివరాలు..

-

దేశంలోని మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది..వీటిలో ఒకటి ఉచిత కుట్టు యంత్రం యోజన- 2022. ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తుంది.ఈ పథకంలో మహిళలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మరెవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తోంది.
ఈ స్కీమ్ అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు చేయడం ద్వారా కుట్టు మిషన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక్కో రాష్ట్రంలోని 50 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది..

ఏ వయస్సు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు…

20 నుంచి 40 మధ్య వయస్సున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఉచిత కుట్టు యంత్రాల పథకం ప్రయోజనం పొందుతారు. దీని కోసం మహిళలు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేయాలనుకుంటే, ముందుగా దాని అధికారిక వెబ్‌సైట్ www.india.gov.inకి వెళ్లాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో, కుట్టుపని ఉచిత సరఫరా కోసం దరఖాస్తు చేయడానికి మీరు లింక్‌ను క్లిక్ చేయాలి. అధికారుల దర్యాప్తు సమయంలో.. దరఖాస్తులో ఇచ్చిన సమాచారం సరైనదని తేలితే, మీకు ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వబడుతుంది.

కుట్టు మిషన్ పొందడానికి ఎటువంటి పత్రాలు అవసరం..

*. ఆధార్ కార్డు
*. పుట్టిన తేదీ సర్టిఫికేట్
*. ఆదాయ ధృవీకరణ పత్రం
*. మొబైల్ నంబర్
*. పాస్పోర్ట్ సైజు ఫోటో

పథకానికి ఎవరూ అర్హులు..

దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతదేశ పౌరులు అయి ఉండాలి. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మహిళా దరఖాస్తుదారు భర్త వార్షికాదాయం రూ.12వేలకు మించకూడదు. వితంతువులు, దివ్యాంగులు కూడా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..www.india.gov.in వెబ్‌సైట్ కి లాగ్ ఇన్ అవ్వగలరు..

Read more RELATED
Recommended to you

Latest news