ఈ పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌లతో అధిక వడ్డీ..!

-

ఈ మధ్య కాలం లో చాలా స్కీమ్స్ వచ్చాయి. స్కీమ్స్ లో డబ్బులను పెడితే మంచిగా డబ్బు వస్తాయి. అయితే పోస్టాఫీసు కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఎక్కువగా రిటర్న్స్ అందిస్తాయి. పైగా వీటిలో డబ్బులు పెడితే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. అలానే వడ్డీ రేటు కూడా బాగా వస్తుంది.

ఈ స్కీమ్స్ లో 5.5-7.6% మధ్య వడ్డీ రేట్లను పోస్టాఫీసు ఇస్తోంది. అధిక వడ్డీ రేట్ల తో పాటు ఎన్నో లాభాలను మనం పొందొచ్చు. అయితే మరి వీటిలో వున్నా మూడు బెస్ట్ స్కీమ్స్ గురించి చూసేద్దాం. పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ ఆడ పిల్లల కోసం తీసుకొచ్చారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లలు ఇందులో చేరచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 7.6 శాతం వడ్డీ రేటు తో రాబడిని ఇస్తోంది. ఇందులో కనిష్ఠంగా రూ. 250, గరిష్ఠంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్‌ చెయ్యచ్చు.

ఇది ఇలా ఉంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేస్తే 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారు ఇందులో చేరవచ్చు. గరిష్ట డిపాజిట్ రూ. 15 లక్షలకు మించకూడదు. ఇక ఇది ఇలా ఉంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో కూడా మంచిగా డబ్బులొస్తాయి. కనీసం రూ. 500, గరిష్ఠంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. మినిమమ్ రూ.100 ఉంటుంది. ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును ఈ స్కీమ్ తో పొందొచ్చు. పీపీఎఫ్ పథకం కోసం ఖాతా మెచూరిటీ వ్యవధి 15 ఏళ్లుగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news