పోలీస్ శాఖలో త్వరలోనే ఖాళీల భర్తీ చేస్తామని హోం మంత్రి మహమమూద్ అలీ ప్రకటన చేశారు. మహిళల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ అంటే నా దృష్టిలో ఒక శక్తి, పవర్ అనేది నా ఉద్దేశ్యమన్నారు. ఈ రోజు SHO గా నియామకం అయిన మధులతకు శుభాకాంక్షలన్నారు. సీఎం కేసీఆర్ మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఇండియాలో ప్రతీ రోజు ఉమెన్స్ డే నే…మన దేశంలో మహిళలను గౌరవించుకుంటాం…ఫారెన్ కంట్రీస్ లో అలా ఉండదని వెల్లడించారు.
పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది పాత్ర కీలకం… వారి సంఖ్య కూడా పెరిగిందని.. అన్నీ పీ. యస్ లలో మహిళా సిబ్బంది కి అన్నీ వసతులు కల్పిస్తున్నామని స్పస్టం చేశారు. వాష్ రూమ్స్, ఫీడ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ కట్టిస్తున్నామని.. మహిళలు అన్నీ రంగాలలో పైకి రావాలని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఏ పథకం లో అయిన మొదటి ప్రాధాన్యం మహిళలకే ఇస్తున్నారని.. తెలంగాణ పోలీస్ ఇండియాలోనే నెంబర్ వన్ ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు పోలీస్ మీద నమ్మకం భరోసా ఉంది అంటే వాళ్ళ పని తీరుకు నిదర్శనమని.. మన దగ్గర నెంబర్ వన్ లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పారు…