గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని తెలుసుకోండి..!

-

మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా గోల్డ్ లోన్ తీసుకుంటూ వుంటారు. బ్యాంకుల వద్ద బంగారాన్ని తాకట్టుపెట్టి కొంచెం లోన్ తీసుకుంటూ వుంటారు. అయితే ఒక్కోసారి లోన్ చెల్లింపులు సమయానికి చేయలేకపోతుంటారు.

 

ఎక్కువ మందికి ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. ఆఖరున చెల్లింపులు చేయకపోవడంతో తాకట్టు పెట్టిన పూర్తి బంగారాన్ని కోల్పోతుంటారు. అయితే గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకునే వారు వీటిని చూసి అనుసరిస్తే ఇబ్బంది ఉండదు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

మాములుగా బ్యాంకింగ్ సంస్థలు తాకట్టు పెట్టే బంగారం విలువ కన్నా తక్కువ రుణాన్ని ఇస్తాయి. అయితే బంగారానికి వచ్చే వీలైనంత ఎక్కువ సొమ్మును రుణంగా తీసుకుంటే అప్పుడు రిస్క్ తక్కువగా ఉంటుంది.
అలానే బ్యాంక్ ఇచ్చిన సమయానికి లోన్ చెల్లించాలి. లేదు అంటే 2 నుంచి 3 శాతం వరుకు అదనపు ఛార్జీలు పడతాయి. దీనితో క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినే అవకాశం వుంది. పెనాల్టీ కూడా పడచ్చు. కనుక సమయానికి చెల్లించండి.
అలానే ఈ లోన్ అంతా ఒకేసారి కట్టక్కర్లేదు. ఈఎమ్ఐల రూపంలో చెల్లించే వెసులుబాట్లు కూడా బ్యాంకింగ్ సంస్థలు ప్రస్తుతం అందిస్తున్నాయి. వాటిని రుణగ్రహీతలు వినియోగించుకోవాలి.
లోన్ యొక్క వడ్డీని ముందుగా చెల్లించి తరవాత అసలు చెల్లించాలి. అలానే వినియోగదారులు లోన్ పొందేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువగా ఉంటే తదరు సంస్థతో మాట్లాడి దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
తక్కువ కాలానికి రుణం కావాలనుకున్నప్పుడు మాత్రమే బంగారంపై లోన్ తీసుకోవడం మంచిది. ఎక్కువ కాలానికి అయితే ఇది వద్దు.
లోన్ పొందినవారు గడువు ముగిశాక 90 రోజుల గ్రేస్ సమయంలోపు బంగారు రుణానికి సంబంధించి చెల్లింపులు పూర్తి చేయకపోతే.. ఆ బంగారాన్ని అమ్మేందుకు చట్టపరంగా చర్యలు బ్యాంక్ చేపడుదుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news