వాటే స్కీమ్… రూ.1000 డిపాజిట్ చేస్తే…రూ.12 లక్షలు పొందొచ్చు..!

-

చాలా మంది వివిధ రకాల స్కీమ్స్ లో డబ్బుల్ని పెడుతూ వుంటారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన మంచిగా లాభాలు వస్తాయి. మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఏ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచి రాబడి వస్తుంది అనేది చూస్తే.. పీపీఎఫ్ స్కీమ్ తో మంచిగా రాబడి వస్తుంది.

money
money

అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ తో ఆకర్షణీయ రాబడి, రిస్క్ ఫ్రీ రిటర్న్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే ఈ స్కీమ్ లో చాలా మంది ఇన్వెస్ట్ చెయ్యాలని భావిస్తారు. ఈ స్కీమ్ లో ప్రతి నెలా కొంత మొత్తం డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి.

పీపీఎఫ్ స్కీమ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అంటే మీరు 15 ఏళ్లు డబ్బులు పెట్టాలి. అవసరం అనుకుంటే 5 ఏళ్ల చొప్పున ఎక్స్టెండ్ చెయ్యాలి. ఈ స్కీమ్ యొక్క వడ్డీ రేట్లు మూడు నెలలకి ఓ సారి మారుస్తూ వుంటారు. ఇక ఈ స్కీమ్ తో ఎంత డబ్బులు వస్తాయి అనేది చూస్తే..

ఈ స్కీమ్ లో నెలకు రూ.1000 ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే దీని కోసం మీరు రోజుకు రూ.30 ఆదా చేసినా సరిపోతుంది. ఇప్పుడు మీరు 15 ఏళ్లు డబ్బులు పెడితే మీకు రూ.3.25 లక్షలు వస్తాయి. అలానే ఐదేళ్ల మెచ్యూరిటీ కాలాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటే అప్పుడు మీ చేతికి రూ.5.32 లక్షలు లభిస్తాయి.

మరో పదేళ్ల చొప్పున ఇన్వెస్ట్‌మెంట్లను కనుక చేస్తే అంటే మొత్తంగా 30 ఏళ్లు డబ్బులు పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ.12.36 లక్షలు పొందొచ్చు. అంటే నెలకు రూ.1000 కట్టుకుంటూ వెళితే రూ.12 లక్షలు పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news