మ్యూచువల్ ఫండ్స్: ఈక్విటీల్లో ఒక్కరోజు కూడా పెట్టుబడి పెట్టొచ్చా?

-

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం.. ఎంతకాలం పెట్టుబడి పెట్టాలీ అని. ఈ విషయం తెలుసుకోకుండా పెర్ఫార్మెన్స్ బాగుంది కదా అని పెట్టుబడి పెట్టొద్దు. మ్యూచువల్ ఫండ్లలో పూర్వపు పెర్ఫార్మెన్స్ మీద భవిష్యత్తు పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉండదు. అందుకే ఏ రకమైన ఫండ్లలో ఎన్ని రోజులు పెట్టాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అవ్వండి.

మ్యూచువల్ ఫండ్లు మూడు రకాలు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు
డెట్ ఫండ్లు..
హైబ్రిడ్ ఫండ్లు.

అయితే చాలామంది ఈక్విటీ అనగానే భయపడిపోతారు. తమ డబ్బులు పోతాయన్న భయంతో ఆ పేరు చెప్పగానే పక్కకు తప్పుకుంటారు. మరికొంత మంది మాత్రం ఈక్విటీల్లో లాభాలు ఎక్కువగా వస్తాయని చిన్న చిన్న మొత్తాల్లో తక్కువ కాలానికి పెట్టుబడి పెడుతుంటారు.

ఈ రెండూ తప్పే. మ్యూచువల్ ఫండ్లలో ఒక్కరోజు కూడా డబ్బుదాచుకోవచ్చు. కానీ ఏ రకం ఫండ్లలో పెట్టాలి అనేది తెలుసుకోవాలి. ఈక్విటీ ఫండ్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. స్వల్పకాలిక పెట్టుబడులకు ఈక్విటీల్లో పెట్టడం సరైన పద్దతి కాదు.

సాధారణంగా ఒక్కరోజు డబ్బులు దాచుకుని కూడా తీసుకోవచ్చు. కానీ అలా తీసుకున్న అమౌంట్ మనం పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ ఉన్నట్టయితే, టాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఈక్విటీల్లో సంవత్సరం కంటే ముందే తీసుకోవడం వల్ల ఎక్సిట్ లోడ్ అని ఛార్జ్ ఉంటుంది.

అదే దీర్ఘ కాలం ఉంచితే పైన చెప్పినవేమీ వర్తించవు. ఒక్కరోజు డబ్బు దాచుకోవడానికి డెట్ ఫండ్లు ఉంటాయి. ఎంత డబ్బయినా ఎన్ని రోజులయినా ఎక్సిట్ లోడ్ లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు.

గమనిక: మ్యూచ్యువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. స్కీముకి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగ్గా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news