వాహనకొనుగోలుదారులకి స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్…!

వాహనకొనుగోలుదారులకి దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈజీ రైడ్ స్కీమ్‌ ని తీసుకు వచ్చింది. ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ కొత్తగా బైక్, స్కూటర్ వంటివి కొనుగోలు చేయాలని భావించే వారికి బెనిఫిట్ అయ్యేలా ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది.

SBI
SBI

ఎవరైన టూవీలర్ వాహనాల్ని కొనాలని అనుకుంటే వాళ్లకి ప్రిఅప్రూవ్డ్ లోన్స్ వస్తాయి. ఈ సేవలని యోనో ద్వారా పొందొచ్చు. ఇది అలా ఉంటే అర్హత కలిగిన వారికి కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసేందుకు రూ.3 లక్షల వరకు సులభంగానే లోన్ ఇవ్వడం జరుగుతుంది.

దీనితో వాహనకొనుగోలు దారులకి ఉపయోగకరంగా ఉంటుంది. లోన్ పొందాలని భావించే వారు నేరుగా బ్యాంక్ కి వెళ్లి లోన్ తీసుకోచ్చు. దీనికి వడ్డీ రేటు 10.25 శాతంగా వుంది. రూ.20 వేల నుంచి లోన్ ని తీసుకొచ్చు. అయితే ఆ లోన్ అమౌంట్ ని నాలుగేళ్ళ లోగా చెల్లించాల్సి వుంది.

రూ.లక్షకు రూ.2560 ఈఎంఐ పడుతుంది. మీరు కనుక కారు కొనాలని అనుకుంటే తక్కువ వడ్డీకే వస్తుంది. 7.5 శాతం వడ్డీ రేటుకే లోన్ ని పొందొచ్చు. దీనిపై అయితే రూ.లక్షకు రూ.1832 ఈఎంఐ పడుతుంది. యోనో యాప్ నుండి లోన్ ని పొందొచ్చు.