good to know ఫోన్ పాస్ వర్డ్ వల్ల ప్రాణమే పోయే ప్రమాదం.. ఎలాగంటే…!

-

The password on your phone can be your death warrant.

నా ఫోన్ కు ఎన్ని పాస్ వర్డ్ లు ఉన్నాయో తెలుసా? మీరు కాదు కదా.. ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చినా నా పాస్ట్ వర్డ్ ను ట్రాక్ చేయలేడు.. అంటూ కొందరు సవాళ్లు విసురుతుంటారు. మీ ఫోన్ కు పాస్ వర్డ్స్ ను పెట్టుకోవడం వల్ల మీ ఫోన్ సేఫ్ గానే ఉంటుంది. మరి.. మీ భద్రత కోసం, జీవితం కాపాడుకోవడం కోసం ఏం చేస్తున్నారు. అర్థం కాలేదా? కొన్ని కేస్ స్టడీలు చదువుదాం పదండి.

ఓ గర్భిణీ ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. ఆ సమయంలో తన భర్త ఇంట్లో లేదు. తన కూతురు మాత్రం ఉంది. ఆ చిన్నారికి మూడునాలుగేళ్లు ఉంటాయి కావచ్చు. తన తల్లి ఎందుకు కింద పడిపోయిందో అర్థం కాక.. తన తల్లి ఫోన్ తీసుకొని తన తండ్రికి ఫోన్ చేయబోయింది. ఫోన్ ఓపెన్ కాలేదు. దానికి పాస్ వర్డ్ సెట్ చేసి ఉంది. తనకు పాస్ వర్డ్ తెలియక తన తండ్రికి కాల్ చేయలేకపోయింది. దీంతో తీవ్ర రక్త స్రావం అయి ఆ గర్భిణీ చనిపోయింది.

ముగ్గురు ఫ్రెండ్స్ కారులో వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు కారుకు ప్రమాదం జరిగింది. దీంతో కారులోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయలయి… స్పృహ తప్పి పడిపోయారు. కారు ప్రమాదాన్ని గమనించిన ఓ వ్యక్తి కారు దగ్గరికి వెళ్లాడు. అచేతన స్థితిలో పడి ఉన్న వాళ్లను చూసి అంబులెన్స్ కు ఫోన్ చేద్దామనుకునే సరికి తన వద్ద ఫోన్ లేదు. కారులో 6 ఫోన్లు కనిపించాయి అతడికి. వాటిని తీసుకొని కాల్ చేద్దామని ప్రయత్నించినా.. ఆ ఫోన్లకు ఉన్న పాస్ వర్డ్స్ కారణంగా అతడు ఫోన్ చేయలేకపోయాడు. వాళ్లను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోయేసరికి.. వాళ్లు ముగ్గురూ మృతిచెందారు.

ఇది ఎవరి తప్పు.. ఫోన్ కు పాస్ వర్డ్ పెట్టిన వాళ్ల తప్పా? ఫోన్ ఉన్నా ఫోన్ చేయలేక వాళ్లను కాపాడలేకపోయిన వాళ్ల తప్పా? ఎవరి తప్పు.

మన ఫోన్ లో ఉన్న డేటా కన్నా.. మన జీవితం ముఖ్యం కదా. ఆ విషయం మనం మరిచిపోవద్దు. మన లైఫ్ కన్నా ఏదీ ఎక్కువ కాదు. డబ్బు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చు. ఫోన్ పోయినా మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ.. ప్రాణం పోతే.. మళ్లీ ఈ జీవితం వస్తుందా? ఎన్ని కోట్లు దారపోసినా పోయిన ప్రాణం తిరిగి రాదు.

ఫోన్ కు పాస్ వర్డ్స్ పెట్టుకోవద్దని కాదు.. నిరభ్యంతరంగా పెట్టుకోండి. కానీ.. వాట్సప్, టెక్స్ట్ మెసేజెస్, ఫేస్ బుక్, ముఖ్యమైన ఫైల్స్.. ఇంకా ఏవైనా ఉంటే వాటికి పాస్ వర్డ్ పెట్టుకోండి. వాటిని ఎవరూ ఓపెన్ చేయకుండా చూసుకోండి. కానీ.. ఫోన్ ఓపెన్ చేయడానికి కూడా పాస్ వర్డ్ పెట్టుకోకండి. కాల్స్ చేసుకోవడానికి ఎటువంటి పాస్ వర్డ్ లేకుండా చూసుకోండి. అది మీకే మంచింది. మీ జీవితాన్నే కాపాడొచ్చు అది. లేదంటే మీ ఫోన్ కు పెట్టుకున్న పాస్ వర్డే మీ ప్రాణాలను హరించొచ్చు.. జాగ్రత్త.

విలువైన ఈ స‌మాచారాన్ని మీ కుటుంబ స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌కు, మిత్రుల‌కు షేర్ చేసి తెలియ జేయండి..

Read more RELATED
Recommended to you

Latest news