అడుగున ఉన్న రాళ్ళు కూడా అందంగా కనిపించే నది.. ఇండియాలోనే..

-

భారతదేశానికి ఉన్న ప్రకృతి సంపద తక్కువేమీ కాదు. శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు, అటు గుజరాత్ కచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని ఆఖరి భాగం వరకు అంతటా అతి సుందర దృశ్యాలే కనిపిస్తుంటాయి. అందుకే భారతదేశానికి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పర్యాటక ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. దేనికదే ప్రత్యేకతని చాటుకుంటూ ఎంతో మంది పర్యాటకుల ఫేవరేట్ ప్రాంతంగా నిలుస్తూ వస్తుంది.

నదులు, సముద్రాలు, జలపాతాలు, సరస్సలు భారతదేశ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఐతే ప్రస్తుతం కాలుష్యం వల్ల నదులు, సముద్రాల్లో నీరు కలుషితం అవుతుంది. దానివల్ల అద్భుతమైన సుందర ప్రదేశాలు తమ శోభని కోల్పోతున్నాయి. ఇప్పటికే చాలా నదుల్లో ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాలు చేరడం వల్ల తాగడానికి పనికిరాకపోవడమే కాకుండా పర్యాటకంగా నిలవలేకపోతున్నాయి. ఐతే మేఘాలయలోని ఉంగోట్ నది మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

మేఘాలయలో ఉన్న ఉంగోట్ నది స్వచ్చతకు మారుపేరుగా నిలుస్తుంది. నది అడుగుభాగంలో ఉన్న రాళ్ళు రప్పలు కూడా స్పష్టంగా కనబడేంత స్వచ్చంగా నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. జాంతియా జిల్లాలో దాంకీ అనే చిన్న నగరానికి దగ్గరగా ఉండే ఈ నదిలో ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. పడవ మీద ప్రయాణిస్తుంటే నదిలో కనిపించే జీవరాశులు, వాటికింద కనిపించే రాళ్ళు, మరింత అందంగా కనిపించి కనులకు కనువిందు చేస్తుంటాయి. అందుకే ఈ నదిని ఆసియాలేనే అత్యంత శుభ్రమైన నదిగా గుర్తించారు. ఈ సుందర దృశ్యాన్ని చూడాలనుకుంటే మేఘాలయ వెళ్ళిపోండి.ప్రకృతి ఒడిలో సేదతీరండి

Read more RELATED
Recommended to you

Latest news