చాలా మంది విదేశాలకి వెళ్లాలని అనుకుంటూ వుంటారు. విదేశాలకి వెళ్లి మంచిగా ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటారు. మీరు కూడా ఏదైనా టూర్ వేసేయాలి చూస్తున్నారా..? చక్కగా ఎంజాయ్ చెయ్యాలని వుందా..? అయితే వీటిని చూడాల్సిందే. డిసెంబర్ నెలలో ఎంచక్కా ఈ ప్లేసెస్ ని చూసి వచ్చేయచ్చు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.
బ్యాంకాక్:
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ కి కూడా వెళ్ళవచ్చు. హనీమూన్ కి ఇక్కడకు వెళ్ళడానికి చాలా మంది బాగా ఇష్టపడతారు. అందమైన బీచ్‌లు, ద్వీపాలు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి.
వినీస్:
ఈశాన్య ఇటలీలోని వినీస్ వుంది. డిసెంబర్ నెలలో ఎంచక్కా ఈ ప్లేస్ కి వెళ్ళచ్చు. 117 దీవుల సమూహంగా ఉండే ఇక్కడ చాలా చక్కటి కెనాల్స్ వున్నాయి. మొత్తం బ్రిడ్జిలతో కనెక్టివిటీ కలిగి ఉంటుంది ఇది. డిసెంబర్‌లో ఇక్కడకి వెళ్లడం ఎంతో బాగుంటుంది. కనుక హ్యాపీగా ఇక్కడకి మీరు వెళ్లి వచ్చేయచ్చు.
దుబాయ్:
దుబాయ్ కూడా చాలా బాగుంటుంది. డిసెంబర్ నెలలో ఎంచక్కా దుబాయ్ ని చూసి వచ్చేయచ్చు. ఫామిలీ తో ట్రిప్ వేసి వచ్చేయండి.
ఇంగ్లండ్:
లండన్ కూడా చూడాలని చాలా మంది అనుకుంటుంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడ చాలా బాగా జరుపుతాయి. డిసెంబర్ నెలలో హ్యాపీగా ఇక్కడకి వెళ్లి వచ్చేయచ్చు.
స్ట్రాస్‌బర్గ్:
ఇక్కడకి కూడా వెళ్లి వచ్చేయచ్చు. ఫ్రాన్స్ ఆఫ్‌బీట్ గమ్యస్థానాల్లో ఒకటి స్ట్రాస్‌బర్గ్. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కోసం ఇక్కడకి వెళ్ళచ్చు. పురాతన భవనాలు, స్మారక చిహ్నాలు, చర్చీలు బాగా ఆకట్టుకుంటాయి. ఏదైనా విదేశీ ప్రాంతాలకి వెళ్లాలంటే ఇక్కడకి కూడా వెళ్లి వచ్చేయచ్చు.