హీరో రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమా కథ ఇదే..!!

-

సినిమా పరిశ్రమలో పని చేసే వారికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా వుండాలి. వీటితో పాటు ముందు చూపు చొరవ వుండడం చాలా అవసరం. ఎందుకంటే ఒక సినిమా సెట్స్ మీద వుండగానే ఇంకో సినిమా సెట్ చేసుకొని రెడీ గా వుండాలి. లేకుంటే ఇంకో సినిమా చేయటానికి చాలా గ్యాప్ వస్తుంది. ఆ డైరెక్టర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చినా కూడా చివరికి హిట్ వేడి వెంటనే చల్లారి పోతుంది. అందుకే మన స్టార్ హీరోలు, డైరెక్టర్ లు వరసగా సినిమాలు ఒప్పుకుంటూ కనీసం రెండు సంవత్సారాల వరకు తిరుగులేకుండా చూసుకుంటారు.

కాని ప్రస్తుతం టాలీవుడ్లో ఒక డైరెక్టర్ పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా వుంది. ఆ దర్శకుడే ఉప్పెన సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సాన. ఆ సినిమా తో ఆయన వంద కోట్ల క్లబ్ లో కూడా అడుగుపెట్టాడు. కాని తర్వాత సినిమా ఏది కూడా మొదలు కాలేదు. చాలా రోజులుగా  ఎన్టీఆర్ చూట్టూ తిరిగిగాడు.  కానీ అనూహ్యంగా ఇప్పుడు రామ్‌ చరణ్ సినిమా రాబోతుందనే  వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్ ఇప్పటికే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను వద్దని చెప్పాడు. ఇక బుచ్చి బాబు కథ నచ్చి తనతో చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు శంకర్ తో చేస్తున్న చరణ్‌ మూవీ పూర్తి అవ్వబోతుంది.శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుతో రామ్‌ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతాడు. ఇక రామ్ చరణ్ తో చేసే సినిమా కథ ఒక స్పోర్ట్స్ డ్రామా అని అంటున్నారు. రామ్ చరణ్ పిజిక్ అథ్లెట్ లాగా ఉంటుంది కాబట్టి ఈ సినిమా కు అతను పెర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు అని బుచ్చి బాబు భావిస్తున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news