ఐఆర్సీటీసీ ఇప్పటికే చాలా టూర్ ప్యాకేజీలను తీసుకు వచ్చింది. అయితే తాజాగా హైదరాబాద్ నుంచి మేఘాలయాకు టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. దీనితో చక్కగా వేసవిలో ఫ్యామిలీతో ట్రిప్ వేసేయచ్చు. ఈ టూర్ ప్యాకేజీని “మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం” అనే పేరుతో తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలు లోకి వెళితే..
ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 రోజులు. ఈ టూర్ లో భాగంగా చిరపుంజి, గువాహతి, షిల్లాంగ్ లాంటి ప్రాంతాలు చూసి వచ్చేయచ్చు. 2022 ఏప్రిల్ 26న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. మేఘాలయ, అస్సాంలోని పర్యాటక ప్రాంతాలను చూడాలనుకునే వారికి ఇదే చక్కటి అవకాశం. టూర్ వివరాలని చూస్తే.. ఈ టూర్ మొదటి రోజు హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది.
మొదటి రోజు ఉదయం 9.35 గంటలకు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:15 గంటలకు గువాహతి వెళ్లారు. అక్కడ నుండి షిల్లాంగ్ వెళ్ళాలి. షిల్లాంగ్ లో రాత్రి లోకల్ మార్కెట్ ని చూడచ్చు. అక్కడే రాత్రి స్టే చెయ్యాలి. ఇక రెండో రోజు చిరపుంజి చూడచ్చు. ఎలిఫాంటా ఫాల్స్ ని చూడచ్చు. అక్కడే స్టే చెయ్యాలి రాత్రికి. మూడో రోజు ఉదయం మావ్లిన్నాంగ్ తీసుకెళ్తారు. లివింగ్ రూట్ బ్రిడ్జ్, దావ్కీ లేక్ వంటి వాటిని చూసి వచ్చేయచ్చు.
సాయంత్రానికి షిల్లాంగ్ చేరుకుంటారు. రాత్రికి షిల్లాంగ్లోనే స్టే చెయ్యాలి. నాలుగో రోజు ఉదయం డాన్ బోస్కో మ్యూజియం, వార్డ్స్ లేక్ చూడచ్చు. ఐదో రోజు ఉదయం గువాహతి బయల్దేరాలి. దారిలో ఉమియం సరస్సు చూడచ్చు. తర్వాత బ్రహ్మపుత్ర నది చూసి వచ్చేయచ్చు. రాత్రి గువాహతిలోనే స్టే చేయాలి. ఆరో రోజు ఉదయం కామాఖ్య ఆలయానికి తీసుకెళ్తారు. తర్వాత గువాహతి ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తారు. మధ్యాహ్నం 3.35 గంటలకు గువాహతిలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.25 గంటలకు హైదరాబాద్ వెళ్ళిపోచ్చు. ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.29,900, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.32,550, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.38,550. అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో పూర్తి వివరాలని చూడచ్చు.