DRUGS TEST: డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ టెస్ట్

-

తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది.పబ్స్ లలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.ఖరీదైన డ్రగ్స్ నగరంలో ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి.బంజారాహిల్స్ రాడిసన్ హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దొరికిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది.ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ డ్రగ్స్ పై ఫోకస్ పెట్టింది.డ్రగ్స్ ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే డ్రగ్స్ టెస్టులు చేయాలని నిర్ణయించింది.నోట్లోని లాలాజలంతో టెస్ట్ నిర్వహిస్తారు.దీని ద్వారా రెండునిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తోంది.పాజిటివ్ వస్తే మాత్రం, రక్త పరీక్షలతో నిర్ధారణ కు వస్తారు.కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఈ తరహా విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

 

డ్రగ్స్ టెస్టుల నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు ప్రారంభించారు అని తెలుస్తోంది.డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్ లు ఉపయోగించడం తెలిసిందే.ఇదే తరహాలో డ్రగ్స్ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్స్ అనలైజర్ లు వినియోగించనున్నారు.డ్రగ్ అనలైజర్ లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను అధ్యయనం చేయనుంది హైదరాబాద్ పోలీస్ శాఖ.డ్రగ్స్ తీసుకుంటే ఎరుపు రంగులో, లేకపోతే ఆకుపచ్చరంగులో చుక్కలు వస్తాయి.ఈ డ్రగ్ అనలైజర్ పరీక్షలో పాజిటివ్ వస్తే మాత్రం రక్త పరీక్షలు నిర్వహించి ఒక నిర్థారణకు వస్తారు.ఈ పరీక్షల ద్వారా డ్రగ్స్ వినియోగదారుల ఆట కట్టించవచ్చు అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news