అరుణాచల్ ప్రదేశ్ లో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతం.. జంగ్ వాటర్ ఫాల్స్..!

-

ఈ వాటర్ ఫాల్ ను వర్షాకాలం ప్రారంభం నుంచి వర్షాకాలం పూర్తయ్యే లోపు సందర్శించవచ్చు. అంటే.. జూన్ నుంచి అక్టోబర్ దాకా సందర్శించవచ్చు. వర్షాలు ఎక్కువగా పడితే.. జాలు వారే నీళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

మీరు బాలీవుడ్ లో వచ్చిన కోయిలా సినిమాను చూశారా? మాధురీ దీక్షిత్ నటించిన ఆ సినిమాలోని ఓ సాంగ్ తన్హాయ్ తన్హాయ్ తన్హాయ్ బ్యాక్ గ్రౌండ్ లో అద్భుతమైన వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఆ వాటర్ ఫాలే జంగ్ వాటర్ ఫాల్. దాన్నే నురంగాంగ్ ఫాల్స్ లేదా బాంగ్ బాంగ్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ భారతదేశంలోనే అతి సుందరమైన వాటర్ ఫాల్. అందుకే.. అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లే ఏ టూరిస్ట్ అయినా.. ఈ వాటర్ ఫాల్ ను సందర్శించి కానీ వెళ్లడు.

జిల్లా కేంద్రం తవాంగ్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్. మొదటి సారి వెళ్లే పర్యాటకలు.. ముందుగా తవాంగ్ చేరుకొని అక్కడి నుంచి ఈ వాటర్ ఫాల్ కు చేరుకోవచ్చు. సముద్ర మట్టానికి 6000 ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఈ వాటర్ ఫాల్. నురానంగ్ నది.. తవాంగ్ నదిలో కలవడానికంటే ముందు… ఇలా వాటర్ ఫాల్ లా ఏర్పడుతుంది. ఇక్కడ హైడెల్ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. వాటర్ ఫాల్స్ నుంచి జాలువారిని నీటితో అక్కడ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు.

ఈ వాటర్ ఫాల్ ను వర్షాకాలం ప్రారంభం నుంచి వర్షాకాలం పూర్తయ్యే లోపు సందర్శించవచ్చు. అంటే.. జూన్ నుంచి అక్టోబర్ దాకా సందర్శించవచ్చు. వర్షాలు ఎక్కువగా పడితే.. జాలు వారే నీళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో అక్కడ మరింత ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. సుమారు 100 మీటర్ల ఎత్తు ఉన్న కొండ నుంచి నీరు జాలువారుతుంది. వాటర్ ఫాల్ తో పాటు.. పక్కనే ఉన్న తవాంగ్ మానస్టెరీని కూడా సందర్శించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news