రుచిక‌ర‌మైన క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. చేద్దామా..!

-

మొక్క‌జొన్న‌లంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. వాటిని ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు కాల్చుకుని తింటారు. ఇక మ‌రికొంద‌రు వాటితో గారెలు వేసుకుని తింటారు. అయితే మొక్క‌జొన్న‌ల‌తో ఇంకా మ‌నం ఎన్నో వంట‌కాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి.. క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. వీటిని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే. మ‌రి క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

స్వీట్ కార్న్ (బాగా న‌లిపిన‌వి) – 3/4 క‌ప్పు
స్వీట్ కార్న్ (క్రీమ్ స్టైల్‌) – 1/2 కప్పు
మొజ‌రెల్లా చీజ్ (తురుమింది) – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
ఉల్లికాడలు (క‌ట్ చేసిన‌వి) – 1
కొత్తిమీర (త‌రిగింది) – 1 టేబుల్ స్పూన్
ఎండు మిర‌ప‌కాయ‌లు (న‌లిపిన‌వి) – 1/2 టీస్పూన్
ఉప్పు – రుచికి స‌రిప‌డా
కార్న్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ – 1 టేబుల్ స్పూన్
నూనె – త‌గినంత
కార్న్ ఫ్లేక్స్ – కోటింగ్‌కు స‌రిప‌డా

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ త‌యారు చేసే విధానం:

నూనె, కార్న్ ఫ్లేక్స్ త‌ప్ప పైన చెప్పిన అన్ని ప‌దార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి. అనంత‌రం ఆ ఉండ‌ల‌పై కార్న్ ఫ్లేక్స్‌ను కోటింగ్‌లా అమ‌ర్చాలి. ఆ త‌రువాత పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్‌ను వేసి బాగా వేయించాలి. బాల్స్ గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్‌లోకి వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. అనంత‌రం బాల్స్‌కు నూనె ఎక్కువ‌గా ఉంటే టిష్యూ పేప‌ర్స్‌తో తీసేయాలి. ఆ త‌రువాత ఆ బాల్స్‌ను వేడిగా స‌ర్వ్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news