కాశ్మీర్ తులిప్ పువ్వుల పండగ.. ఏకంగా వారం రోజుల పాటు.. చూసొద్దాం రండి.

-

భారతదేశం విభిన్న సంస్కృతులకి నిలయం. మనదేశంలో ఉన్న విభిన్నత ప్రపంచంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. ప్రాంతం ప్రాంతానికి ఉండే వైవిధ్యం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. కాశ్మీరు నుండి కన్యా కుమారి వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారాలు, సాంప్రదాయలు కనిపిస్తాయి. అందుకే ప్రపంచ పర్యాటకంలో భారతదేశానికి అంత ప్రత్యేకత. ఐతే తాజాగా కాశ్మీర్ లో తులిప్ ఉత్సవం జరగనుంది. కాశ్మీర్ లోయలో ప్రకృతి అందాలను చూస్తూ అక్కడ భూమిపై పరుచుకున్న తులిప్ పువ్వులని చూడడం అందమైన అనుభవం.

ఆ అనుభవాన్ని మరింత ఉత్సాహవంతంగా చేయడానికి కాశ్మీర్ పర్యాటక సంస్థ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఏప్రిల్ 3వ తేదీ నుండి వారం రోజుల పాటు తులిప్ పువ్వుల పండగ నిర్వహించనుంది. ఇక్కడకి వచ్చేవారు ఆ అందాలను ఆస్వాదిస్తూనే, కాశ్మీర్ ప్రాంత వైవిధ్యతని చూడవచ్చు. వేష భాషలు, వంటకాలు, స్థానిక కళాకారులచే ప్రదర్శనలు, దేశంలో పేరు తెచ్చుకున్న కళాకారుల ప్రదర్శనలతో అంగరంగా వైభవంగా జాతర జరగనుందని పర్యాటక అధికారి సలీమ్ చేబుతున్నారు.

పండుగ సందర్భంగా హస్తకళ మరియు చేనేత ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి” అని ఆయన చెప్పారు. దీని కోసం దేశ వ్యాప్తంగా ప్రచారం చేపట్టామని, ప్రయాణ సంస్థలు ఈ ప్రచార బాధ్యతలు మోసాయని, అందరికీ కాశ్మీరి అందాలని పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో దేశ మంతటికీ గట్టిగా ప్రచారం చేసామని చెప్పుకొచ్చారు. ఈ పండగ ముగిసిన కొన్ని రోజులకి బోట్ ఫెస్టివల్ ఉండనుందట. ప్రసిద్ధ దాల్ సరస్సులో ఈ పడవల పండగ మొదలవనుందట. దీని కోసం ఆల్రెడీ పనులు మొదలవుతున్నాయని వినబడుతుంది.

పర్యాటకాన్ని ఇష్టపడేవారు, కరోనా వల్ల ఎక్కడికీ వెళ్ళక ఇంట్లోనే కాలం వెళ్ళదీసిన వారు ఎక్కడికైనా వెళ్ళి హాయిగా సేదదీరాలని అనుకుంటే కాశ్మీర్ కన్నా అందమైనది మరొకటి లేదని చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news