8నెలల తర్వాత తెరుచుకున్న మచుపిచ్చు పర్యాటక కేంద్రం..

-

శంకర్ సినిమా రోబోలో కిలీ మంజారో అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. రజనీ కాంత్, ఐశ్వర్యారాయ్ వైవిధ్యమైన కాస్ట్యూమ్స్ ధరించి స్టెప్పులు వేసే ఈ ప్రాంతం పేరు మచు పిచ్చు. పెరూ దేశంలోని ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది. ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం కరోనా కారణంగా ఎనిమిది నెలలుగా మూసివేయబడింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో టూరిజం ప్రదేశాలన్నింటికీ ఉన్న నిబంధనలే దీనికి వర్తించాయి.

ఐతే తాజాగా ఎనిమిది నెలల అనంతరం మచు పిచ్చు తెరుచుకుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని చూడడానికి పర్యాటకులకు అనుమతులిస్తున్నారు. ఒక రోజులీ కేవలం 30శాతం అనగా 675మందికి మాత్రమే అనుమతి ఉంది. నవంబరు 1వ తేదీ నుండి సందర్శకులు మచుపిచ్చుకు వెళ్తున్నారు. కరోనా నియమ నిబంధనలు భౌతిక దూరం, ఫోటో దిగేటప్పుడు పాటించాల్సిన వంటి నియమాలన్ని ఖచ్చితంగా పాటిస్తూ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పర్యాటకులకి అనుమతి లభించకముందు కేవలం ఒకే వ్యక్తికి మచు పిచ్చు సందర్శించే అదృష్టం కలిగింది.

కటయమా అనే వ్యక్తి కరోనా లాక్డౌన్ కంటే ముందే వచ్చి పెరూలో చిక్కుకుపోవడంతో కొద్ది రోజుల క్రితం అతనొక్కడి కోసమే మచుపిచ్చు గేట్లు తెరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news