విశాఖ నుంచి నౌకలో టూర్.. సరదాగా ఇలా వీటిని చూసొచ్చేయచ్చు..!

రైలు మార్గంలో రోడ్డు మార్గంలో కాకుండా మీరు నౌకలో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. విశాఖపట్నం నుంచి క్రూజ్ టూర్ అందుబాటులోకి వస్తోంది. కార్డేలియా సంస్థకు చెందిన ఎంప్రెస్ నౌక విశాఖపట్నం నుంచి ప్రయాణించనుంది. ఇలా మీరు ట్రావెల్ చేసి సరదాగా గడపచ్చు.

 

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. జూన్ 15, 22 తేదీల్లో కూడా క్రూజ్ టూర్ అందుబాటులో ఉంది. నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. లగ్జరీ నౌకలో ఇంటీరియర్, ఓషియన్ వ్యూ, మినీ సూట్, సూట్ పేరుతో వేర్వేరు ప్యాకేజీలు వున్నాయి. నచ్చిన దానిని ఎంపిక చేసుకోచ్చు. ఈ నౌకలో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అక్కర్లేదు. ప్యాకేజీని బట్టి ధర ఉంటుంది.

ఈ టూర్ మొదటి రోజు రాత్రి 8 గంటలకు విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే కార్డేలియా ఎంప్రెస్ నౌక వైజాగ్ లో ఎక్కాలి. ఆరోజు రాత్రి, రెండో రోజంతా సముద్ర ప్రయాణమే. చక్కగా సముద్రాన్ని చూస్తూ సరదాగా గడపచ్చు. ఆహరం కూడా నౌక లోనే ఉంటుంది. అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి.

స్పా కూడా వుంది. మూడో రోజు ఉదయం 7 గంటలకు పుదుచ్చెరీ రీచ్ అవుతారు. అక్కడ నుండి చెన్నైకి వెళ్ళాలి. నాలుగో రోజు చెన్నై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. కార్డేలియా ఎంప్రెస్ నౌకలో లగ్జరీ సౌకర్యాలు కూడా వున్నాయి. అడ్వెంచర్ యాక్టివిటీస్, ఐదు బార్లు, డీజే పార్టీ, థియేటర్, నైట్ క్లబ్, ఫిట్‌నెస్ సెంటర్, మూడు స్పెషల్ రెస్టారెంట్లు, లాంజెస్, లైవ్ బ్యాండ్స్, స్విమ్మింగ్ పూల్ ఇలా ఈ సేవలని ప్రయాణికులు పొందొచ్చు.