ట్రంప్ షాకింగ్ డెసిషన్: ఆ స్తోమత లేకపోతే అమెరికాలోకి నో ఎంట్రీ..

-

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని వారికి అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వలసల్ని అడ్డుకోవటమే అజెండాగా మందుకు కెళుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ దిశాగ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అగ్రరాజ్యంలో ప్రవేశించిన 30 రోజుల్లోగా ఆరోగ్య బీమా తీసుకోకపోయినా అమెరికా ప్రవేశార్హత కోల్పోవాల్సి ఉంటుందని నిబంధన విధించారు.

అయితే ఈ నిబంధనల నుంచి శరణార్థులకు మాత్రం అమెరికా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. సొంతంగా వైద్య ఖర్చులు భరించలేని వారిని అమెరికాలోకి అనుమతించడం ద్వారా ఇక్కడి వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.. అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక‌ నవంబర్ 3 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news