కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ … మీ పాత బైక్స్, కార్లను ఇక ఇనుప సామాన్లకే…!

-

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త రూల్స్ ని తీసుకు రానుంది. మీ వద్ద పాత స్కూటర్ కానీ బైక్ కానీ కారు కానీ ఉంటె మీరు ఈ విషయం గురించి తప్పక తెలుసుకోవాలి. త్వరలో రానున్న నిర్ణయంతో పాత వాహనాలు కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. అయితే మరి పూర్తి వివరాలని ఇప్పుడే తెలుసుకోండి. మంత్రిత్వ శాఖ స్క్రాపేజ్ పాలసీకి సంబంధించిన కేంద్రానికి ప్రతిపాదనలను సమర్పించిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అలానే మోదీ సర్కార్ కూడా ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదం తెలిపొచ్చని కూడా ఆయన అన్నారు.

స్క్రాపేజ్ పాలసీ అమలు లోకి వస్తే ఆటో మొబైల్ పరిశ్రమలో డిమాండ్ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక స్క్రాపేజ్ పాలసీ ప్రతిపాదనల గురించి చూస్తే…. 15 ఏళ్ల కన్నా పాత కమర్షియల్, ప్రైవేట్ వెహికల్స్ ఇక ఉపయోగించడానికి వీలుండదు అని చెప్పారు. మీరు దీనిని ఇనుప సామానుకు వేసుకోవాల్సిందే. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే…? కొత్త వెహికల్స్‌ డిమాండ్ పెంచడానికి, కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇది ఇలా ఉంటె కేంద్ర బడ్జెట్ 2021 ఆవిష్కరణకు ముందు నితిన్ గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్క్రాపేజ్ పాలసీపై తుది నిర్ణయాన్ని పీఎంవో తీసుకుంటుంది. ఒకవేళ ఈ స్క్రాపేజ్ పాలసీకి ఆమోదం లభించి అమలు లోకి వస్తే కనుక భారత్ ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తుందని నితిన్ గడ్కరీ ధీమా చెప్పారు. అలానే ఆ స్క్రాపేజ్ వెహికల్స్‌ భాగాలను కొత్త వాటిలో ఉపయోగించొచ్చని కూడా తెలిపారు. ఇలా కొత్త వాహనాల ధర కూడా తగ్గుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news