ఆరోగ్యశ్రీ కార్డు కావాలా..? అర్హత, అప్లై చేసుకునే విధానం మీకోసం..!

-

ఎన్నో రకాల స్కీమ్స్ ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇందులో ఆరోగ్య శ్రీ కూడా ఒకటి. ఈ స్కీమ్ చాలా బాగా బెస్ట్. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. ఇక దీనికి సంబంధించి వివరాలను చూస్తే..

 

2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. దీని ద్వారా అర్హులైన పేదలు ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు అవుతుంది. లక్షల మంది ఈ స్కీమ్ తాలూకా లాభాలను పొందుతున్నారు.

ఈ స్కీమ్ తో కలిగే సదుపాయాలు:

రవాణా, భోజన, వసతి సదుపాయాలను కూడా వైద్య సేవలతో పాటుగా పొందొచ్చు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ స్కీమ్ కింద నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.

ఎవరు ఈ స్కీమ్ కి అర్హులు..?

అన్ని రకాల బియ్యం కార్డులు వున్నవాళ్లు దీనికి అర్హులు.
రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే కూడా ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందొచ్చు.
వైఎస్సార్ పింఛన్, జగన్నన్న విద్యా, వసతి దీవేన కార్డుకు అర్హత వున్నా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందొచ్చు.
గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు.

ఈ స్కీమ్ కి ఎలా అప్లై చేసుకోవాలి…?

ఈజీగా కార్డుని పొందేందుకు అవుతుంది.
మీకు సమీపంలో వుండే గ్రామ సచివాలయానికి వెళ్లి ఆరోగ్య శ్రీ కార్డు కోసం అప్లై చెయ్యచ్చు.
కొన్ని డాక్యుమెంట్లు మాత్రం ఉండాల్సిందే.
ఫ్యామిలీ ఫోటో ఉండాలి.
రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news