వాట్సప్, ఫేస్ బుక్.. రెండూ సోష్ మీడియా ప్లాట్ ఫాంలే. వాటి గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు… ఫేస్ బుక్, వాట్సప్ ను విరివిగా ఉపయోగిస్తారు. వాట్సప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకోవడం.. ఇప్పుడు ఫేస్ బుక్ కు కలిసొచ్చింది. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కేంబ్రిడ్జి ఎనాలిటికాకు డేటా లీక్ అంశం, ఇతర సెక్యురిటీ విషయంలో ఫేస్ బుక్ కాస్త వెనుకబడింది. కానీ.. వాట్సప్ మాత్రం గత సంవత్సరం అంటే 2018 లో ఫేస్ బుక్ ను వెనక్కి నెట్టేసి మొదటి స్థానంలో నిలిచింది.
గత రెండు సంవత్సరాల వృద్ధి చూస్తే కనుక… వాట్సప్ 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక.. ఫేస్ బుక్ 20 శాతం ఫేస్ బుక్ మెసెంజర్ 15 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఫేస్ బుక్ కొనుగోలు చేసిన మరో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రాం కూడా వృద్ధిలో దూసుకుపోతున్నదట. ఇన్ స్టాగ్రామ్ గత రెండేళ్లలో 35 శాతం వృద్ధిని నమోదు చేసింది.
యూజర్ ఎంగేజ్ మెంట్ ను పరిగణనలోని తీసుకుంటే… అన్ని యాప్స్ కన్నా వాట్సప్ ముందంజలో ఉంది. యాక్టివ్ యూజర్ల విషయంలో ఫేస్ బుక్ పాపులారిటీ పడిపోతున్నదట. ఇండియా, యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వాట్సపే టాప్. కొన్ని దేశాల్లో వీచాట్ టాప్ లో ఉంది. లైన్, కకోవాటాక్ వంటి యాప్స్ కూడా రాజ్యమేలుతున్నాయి.