SBI లేదా పోస్టాఫీసుల్లో ఎక్కడ డబ్బుల్ని దాచుకుంటే బెస్ట్..?

-

చాలా మంది ప్రతీ నెలా డబ్బుల్ని ఆదా చేసి కొంత కాలం తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందాలని అనుకంటూ వుంటారు. మీరు కూడా ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు ఆదా చెయ్యాలని.. కొంత కాలం తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ వీటి కోసం మీరు తెలుసుకోవాలి.

 

డబ్బుల్ని

మరి ఇక ఆలస్యం ఎందుకు వీటి కోసం పూర్తిగా చూసేయండి. ఇలా డబ్బులని అనుకునవే వాళ్లకి రికరింగ్ డిపాజిట్లు బెస్ట్ అని చెప్పవచ్చు. దీనితో మంచిగా రాబడి పొందొచ్చు. పైగా ఇందులో ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

ఇక రికరింగ్ డిపాజిట్ కి సంబంధించి వివరాలని చూస్తే.. 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు కాల పరిమితితో మీరు రికరింగ్ డిపాజిట్ సేవలు పొందొచ్చు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు వస్తుందో ఆర్‌డీ అకౌంట్లపై కూడా అంతే వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఆర్‌డీ ఖాతా తెరవాలంటే దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా పోస్టాఫీస్‌లో కూడా ఓపెన్ చెయ్యచ్చు. అయితే ఇప్పుడు ఏది బెస్ట్ అనేది కూడా చూసేద్దాం. పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరవాలని భావిస్తే.. మీకు 5.8 శాతం వడ్డీ వస్తుంది. అదే ఎస్‌బీఐలో ఆర్‌డీ అకౌంట్ అయితే 5 నుంచి 5.4 శాతం వరకు వడ్డీ వస్తుంది.

పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. పోస్టాఫీస్‌ ఆర్‌డీ అకౌంట్ తెరవడానికి నెలకు రూ.10 కట్టినా సరిపోతుంది. ఏ రిస్క్ ఉండదు. పక్కా డబ్బులు వస్తాయి. అదే ఎస్‌బీఐలో ఆర్‌డీ అకౌంట్ తెరవాలని భావిస్తే ఏడాది నుంచి పదేళ్ల కాల పరిమితితో ఆర్‌డీ ఖాతా తెరవొచ్చు. నెలకు కనీసం రూ.100 నుంచి చెల్లించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news