కేవలం 2 వేలు కడితే ..ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీ సొంతం!

-

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు, మరోవైపు పర్యావరణ హానీ. ఇవన్ని చూస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనడమే మంచిది అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే చాలా సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. పర్యావరణ ప్రియులు కూడా వీటిపై మొగ్గు చూపుతున్నారు. అందులో మామూలు ద్విచక్ర వాహనాల కంటే వీటి ధరలు కూడా తక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్టప్‌ డిటాల్‌ ఈజీ ప్లస్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది.

 

ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర కేవలం 39,999 రూపాయలు. ఇంత తక్కువ ధరకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్టప్‌ డిటాల్‌ ఈజీ ప్లస్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది.ఈ మోడల్‌ కోసం కంపెనీ బుకింగ్‌ తీసుకోవడం కూడా ప్రారంభించిందని ప్రకటించింది. మరెందుకు ఆలస్యం మీకు కావాలంటే, మీరు దానిని రూ.2000తో బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనానికి మీరు 2000 రూపాయల టోకెన్‌ ధరతో ఆన్‌లైన్‌ లో బుక్‌ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌లో 20 ఏహెచ్‌ లిథియం–అయాన్‌ బ్యాటరీ, తక్కువ వేగం, తేలికపాటి ఎలక్ట్రిక్‌ మోడల్‌. ఈ స్కూటర్లను సుమారు 4–5 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ చేయవచ్చు. మీరు ఒకసారి పూర్తి ఛార్జీతో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

రెడ్, ఎల్లో, టీల్‌ బ్లూ , రాయల్‌ బ్లూతో సహా నాలుగు రంగులలో ఈ స్కూటర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.
మీరు ఈ స్కూటర్‌ కొనుక్కుంటే చాలా లబ్ధి పొందవచ్చు. వాస్తవానికి, కంపెనీ స్కూటర్‌పై 2 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. దీని వారంటీ పరిమితి 40,000 కి.మీ వరకు ఉంటుంది. స్కూటర్‌తో పాటు వినియోగదారులకు ప్రీపెయిడ్‌ రోడ్‌సైడ్‌ ప్యాకేజీలు, ఉచిత హెల్మెట్లు కూడా ఇవ్వనుంది. స్కూటర్‌కు సంబంధించిన బుకింగ్‌ కోసం, డెటల్‌ యొక్క అధికారిక సైట్‌నుwww. detel&india.com easy/plus సందర్శించండి . ఈ స్కూటర్‌ భారతీయ రోడ్లకు అనువైందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్‌ లోడ్‌ సామర్థ్యం 170 కిలోలు. ఈ స్కూటర్‌ టాప్‌ స్పీడ్‌ 25 కి.మీ. ఈజీ ప్లస్‌లో బ్యాటరీకి సంవత్సరం వారంటీ ఉంటుంది.
ప్రతి వాహనం అమ్మకంపై చెట్టును కూడా నాటనున్నట్లు డిటల్‌ ఫౌండేషన్‌ తెలిపింది. తన డిటల్‌ డెకార్బోనైజ్‌ ఇండియా చొరవలో భాగంగా, సంస్థ వినియోగదారులకు ప్రశంసల టోకెన్‌ ను కూడా అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news