రాష్ట్రంలో పాదయాత్రల ట్రెండ్.. ఏడాది మొత్తం అదే తంతు

-

పాదయాత్ర. అధికారం చేపట్టడానికి దగ్గరి దారి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాదయాత్రల ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ షర్మిళలు కలసి పాదయాత్రలు చేసి మరీ వైఎస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పడు ఇదే ట్రెండ్ తెలంగాణలోనూ మొదలైంది. రాష్ట్రంలో అధికారం సాధించడం కోసం కాంగ్రెస్, బీజేపీ వైఎస్‌ఆర్‌టీపీలు పాదయాత్రలను మొదలు పెట్టాయి. మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఈ ఏడాది మొత్తం హడావుడి చేశాయి.మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ 2021 ఫిబ్రవరి 13న రైతు భరోసా యాత్ర పేరిట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర దాదాపు 10 రోజులపాటు సాగింది. చివరికి 23వ తేదీన హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో పాదయాత్రను ముగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి నిర్వహించిందే తొలి పాదయాత్ర.

bandi-sanjayనియంతృత్వ కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసం ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ 2021, ఆగస్టు 28న పాదయాత్ర మొదలు పెట్టారు. అదీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభించడం గమనార్హం. దాదాపు 36 రోజులపాటు 483 కి.మీ.ల మేరకు బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఎనిమిది జిల్లాలోని 19 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలను టచ్ చేస్తూ ముందుకు సాగారు. మొత్తం 35 సభలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు సహా వివిధ వర్గాల నుంచి సుమారు 11వేల వినతిపత్రాలను స్వీకరించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మొదటి దశ పాదయాత్రను ముగించారు. రెండో దశ పాదయాత్రకు సన్నహాలు చేస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు తోడు వైఎస్సాఆర్‌టీపీ సైతం పాదయాత్ర చేపట్టింది. తెలంగాణలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల అక్టోబర్ 20న ప్రారంభించింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన చోటనే షర్మిల కూడా పాదయాత్రను మొదలు పెట్టారు. చేవెళ్ల నుంచి ప్రారంభమై నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం తిరిగి చేవెళ్లలోనే ముగిసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించేలా రూట్ మ్యాప్ రూపొందించుకొన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 14 పార్లమెంట్ నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. 400 రోజుల పాటు 4 వేల కి.మీ దూరం పాదయాత్ర నిర్వహించాలని షర్మిల ప్లాన్ చేసుకొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అక్కడే ఆమె పాదయాత్రను నిలిపివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news