“సీబీఎన్ ఆర్మీ”కి ఏపీ మంత్రి ఫేస్ టు ఫేస్ సవాల్!

-

గతకొన్ని రోజులుగా టీడీపీ నేతలకు, చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ మంత్రులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్మీ (సీబీఎన్ ఆర్మీ) కి సవాల్ విసురుతున్నారు. ఈ విషయంలో అటు చంద్రబాబుకు, ఇటు దేవినేని ఉమను తీవ్రస్థాయిలో విమర్శించి, ఓపెన్ ఛాలెంజ్ లు విసిరే ఏపీ జలవనరులశాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్… “సీబీఎన్ ఆర్మీ” వ్యక్తులు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రావాలని ఛాలెంజ్ విసిరారు!

వివరాల్లోకి వెళ్తే… గత కొన్ని రోజులుగా సీబీఎన్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో జగన్ సర్కార్ పై విపరీతమైన అసత్య ఆరోపణలు.. అడ్డగోలు విమర్శలు.. అవగాహన లేని పోస్టులు.. అజ్ఞానంతో కూడిన కామెంట్లు వెళ్లివెత్తుతున్నాయంట! ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకున్నట్లుంది. ఇందులో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్… “విదేశాల్లోనో, చీకటి గదుల్లోనో కూర్చొని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సీబీఎన్ ఆర్మీ వ్యక్తులకు దమ్ముంటే… ఫేస్ టు ఫేస్ రావాలని సవాల్ విసిరారు! కాగా ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ సీబీఎన్ నుంచి కానీ సీబీఎన్ ఆర్మీ నుంచి కానీ స్పందన రాలేదు!

ఇదే క్రమంలో మరోసారి చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమ లపై అనిల్ ఫైరయ్యారు! పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తమ స్టాండ్ ఏమిటో చెప్పాలని చంద్రబాబుకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించిన అనిల్… చంద్రబాబు, లోకేశ్ లు మరీ రాష్ట్రం వదిలి పారిపోకుండా, కనీసం కరకట్ట వద్ద కృష్ణానదిని ఆక్రమించి కట్టిన ఇంట్లో అయినా కూర్చొని మాట్లాడొచ్చు కదా అని విమర్శించారు. ఇక ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో రెండో పంటకు నీరివ్వలేదని ఉమా చేసిన విమర్శలపై ఫైరయిన అనిల్… జిల్లాలో మొదటిపంటకు 8 లక్షల ఎకరాలకు, రెండో పంటకు 2లక్షల ఎకరాలకు నీరిస్తున్న సంగతి తెలుసుకోకుండా మాట్లాడవద్దని సూచించారు!!

Read more RELATED
Recommended to you

Latest news