ఆర్ ఎక్స్ 100 కార్తికేయ లావణ్య త్రిపాఠి ల “చావు కబురు చల్లగా” ..!

-

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమా తర్వాత 90 ఎం.ఎల్, గుణ 369, హిప్పి సినిమాలు చేశాడు. కాని ఆ సినిమాలు అంతగా సక్సస్ ని సాధించలేకపోయాయి. అంతేకాదు నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా కూడా ప్రయత్నించాడు. అయితే ఆ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. కాని కార్తికేయ కి మాత్రం నటుడిగా మంచి పేరే వచ్చింది.

 

ఇక కార్తికేయ లావణ్య త్రిపాఠి జంటగా గా తెరకెక్కబోతున్న తాజా చిత్రం “చావు కబురు చల్లగా”. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే కార్తికేయ, లావణ్య త్రిపాఠి లకు లాక్ డౌన్ లో దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఆన్‌ లైన్ వర్క్‌ షాప్‌లు నిర్వహిస్తున్నాడట. వర్క్ షాప్ లో ఈ హీరో హీరోయిన్స్ ఇద్దరు స్క్రిప్ట్ చదివడం తో పాటు వారి పాత్రలను ప్రాక్టీస్ చేస్తున్నారట.

త్వరలో షూటింగ్ మొదలవబోతున్న ఈ సినిమాని శరవేగంగా కంప్లీట్ చేసేందుకే ఇలా ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దర్శకుడు చెప్పిన కథ వినూత్నంగా ఉండటంతో ఆ కథ కి కార్తికేయ అయితే సరిగ్గా సరిపోతాడని ఎంచుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news