జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు భారత ఆర్మీ ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు. వరుసగా కీలక ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరుపుతుంది. నిఘా వర్గాలు ఇప్పుడు భారత ఆర్మీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కీలక ఉగ్రవాదుల సమాచారాన్ని ఇస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే భారత బలగాలు ఇప్పుడు దూకుడుగా వెళ్తున్నాయి. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులను లేపెసారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులను కాల్చి చంపడానికి గాను ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో ప్రత్యేకంగా ఒక ఆపరేషన్ ని నిర్వహిస్తున్నారు. దీనిలో కీలకంగా పని చేసే ఉగ్రవాదులు అందరిని కూడా ఇప్పుడు నిఘా వర్గాలు గుర్తించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయి. కుల్గాం, బందీపోరా, అవంతిపోరా జిల్లాల్లో భారత ఆర్మీ వరుస ఆపరేషన్ లు నిర్వహిస్తూ వస్తూ ఉగ్రవాదులను లేపెస్తుంది.
ఇప్పటి వరకు భారత ఆర్మీ దాదాపు 200 మంది ఉగ్రవాదులను ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాల్చి చంపింది. ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారం అందితే చాలు దూకుడుగా వెళ్తున్నాయి భారత బలగాలు. ఇక లిస్టు ని తయారు చేసాయి. వంద మంది టాప్ కమాండర్ ల లిస్టు ని తయారు చేసి వారి అందరి మీద గురి పెట్టి ఇప్పటి వరకు 43 మంది టాప్ కమాండర్లను లేపేసింది ఆర్మీ.