అచ్చెన్న అరెస్టు నాకు ముందే తెలుసు : స్పీకర్ తమ్మినేని

-

ఈఎస్‌ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు కాబడ్డ విషయం అందరికీ తెలిసిందే. దీనిపై రాష్ట్రమంతా నిరసనలు జరిపారు టీడీపీ నేతలు. ఇది కక్షపూరితం అని ఒకరు.. లేదు లేదు ఇది కిడ్నాప్ అని మరొకరు. కాదు కాదు ఇది బీసీ లపై జరుగుతున్న కుట్ర అని మరికొందరు. ఇలా టీడీపీ నాయకులు నిన్నటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ విషయంలో తనకు ముందస్తు సమాచారం ఇచ్చారని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేసారన్న తమ్మినేని, నేరానికి బీసీలకు లింక్ పెడుతూ చంద్రబాబు కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news