రమ్యకృష్ణ కారులో 96 బీరు బాటిళ్లు…అడ్డంగా బుక్కైయ్యారు..!

-

చెన్నైలో అక్రమంగా మద్యం తరలిస్తూ దొరికిపోయిన సీనియర్‌ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ వర్గాల్లో ఇప్పుడు ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆ సమయంలో రమ్యకృష్ణ కూడా కారులోనే ఉన్నారు.

చెన్నైలోని కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహనాల తనీఖీల్లో భాగంగా రమ్యకృష్ణ వాహనం తనిఖీ చేయగా.. కారులో మొత్తం 96 బీర్ బాటిల్స్, 8 లిక్క‌ర్ సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేస్తున్నపుడు కారులో రమ్యకృష్ణ, ఆమె సోదరి వినయ కృష్ణ కారులోనే ఉన్నారు. చెన్నైలో మద్యం లభించకపోవడంతో మహాబలిపురం నుంచి తరలిస్తున్న డ్రైవర్ సెల్వకుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే, రమ్యకృష్ణ తన డ్రైవర్ సెల్వకుమార్‌ని బెయిల్‌పై తీసుకుని వెళ్లినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news