టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ 2.. ఫీచ‌ర్లు అదుర్స్‌.. ధ‌ర త‌క్కువ‌..!

-

మొబైల్స్ త‌యారీదారు టెక్నో.. స్పార్క్ ప‌వ‌ర్ 2 పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 7 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ల‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారంగా ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. వెనుక భాగంలో 16 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 5 మెగాపిక్స‌ల్ వైడ్ యాంగిల్స్ లెన్స్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో లెన్స్‌, ఏఐ లెన్స్‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో అమ‌ర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల 0 నుంచి 50 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవ‌లం 60 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది.

Tecno Spark Power 2 smart phone launched in India

టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ 2 స్పెసిఫికేష‌న్లు…

* 7 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్‌సెల్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
* 720 x 1640 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్
* 64జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, డ్యుయ‌ల్ సిమ్
* 16, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ 2 స్మార్ట్‌ఫోన్ ఐస్ జేడియ‌ట్‌, మిస్టీ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.9,999 ధ‌ర‌కు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో జూన్ 23వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news