సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. భారీ బడ్జెట్ తో అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపుందుతుంది. ఈ సినిమా సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. ఈ కాంబినేషన్ మీదా అలాగే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా సుకుమార్ కి రంగస్థలం బ్లాక్ బస్టర్.. అల్లు అర్జున్ కి అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డ్ వంటి ట్రాక్ రికార్డ్ ఉండటం ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.
అయితే ఈ సినిమాని కొబ్బరికాయ కొట్టినప్పుడే భారీ షెడ్యూల్ ని కేరళ లోని దట్టమైన అడవుల్లో అలాగే కొన్ని కీలక సన్నివేశాలను విదేశాలలో ప్లాన్ చేశారు సుకుమార్. కాని కరోనా కారణంగా ఆ షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఇక ఈ సినిమాని జూలై నుండి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సుకుమార్ బృందం ప్లాన్ చేస్తుండగా కొంత డైలమా నెలకొందని తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఒక సెట్ ని నిర్మించారని తెలుస్తుంది.
అలాగే గతంలో రంగస్థలం సినిమాకి వేసిన విలేజ్ సెట్ ప్లేస్ లో ఫారెస్ట్ సెట్ నిర్మించాలని అనుకుంటున్నారని సమాచారం. రంగస్థలం లో వేసిన విలేజ్ సెట్ ఎంత సహజంగా ఉంటుందో అందరీకి తెలిసిందే. అయితే ఫారెస్ట్ సెట్ అంత సహజంగా ఉంటుందా అన్న సందేహాలు కొందమందికి వస్తున్నాయట. కాని సుకుమార్ మాత్రం ఇవన్ని ఆలోచించకుండా సహజత్వం తో కూడుకున్న ఫారెస్ట్ సెట్ ని నిర్మిస్తున్నారని అందుకు ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ అండ్ మౌనిక చాలా శ్రమిస్తున్నారని తెలుస్తుంది. ఈ ఆర్ట్ డైరెక్టర్స్ రంగస్థలం సినిమాకి 30 ఎకరాలలో విలేజ్ సెట్ ని నిర్మించారు.