రియ‌ల్‌మి ఎక్స్3 ఫోన్లు అదుర్స్‌.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి భార‌త్‌లో ఎక్స్3, ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ పేరిట రెండు నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల‌ను గురువారం విడుద‌ల చేసింది. వీటిల్లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లేలు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంటాయి. వీటిల్లో అధునాత‌న స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, 12 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ల‌ను అందిస్తున్నారు. కూలింగ్ కోసం ప్ర‌త్యేకంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాల‌జీని ఈ ఫోన్ల‌లో ఏర్పాటు చేశారు. ఇవి ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారంగా ప‌నిచేస్తాయి.

Realme X3 and X3 SuperZoom smart phones launched in india

వెనుక భాగంలో 64 మెగాపిక్స‌ల్ మెయిన్‌కెమెరా, 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇక ఎక్స్‌3 సూప‌ర్‌జూమ్ ఫోన్‌లో వెనుక భాగంలో 8 మెగాపిక్స‌ల్ పెరిస్కోప్ లెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెన్సార్ 5ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌ను ఇస్తుంది. ఇక ఎక్స్‌3లో 12 మెగాపిక్స‌ల్ టెలిఫొటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ సెన్సార్ పంచ్ హోల్ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌గా, ఎక్స్‌3 ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. వీటిల్లో 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇవి 30 వాట్ల డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉన్నాయి. దీని వ‌ల్ల 0 నుంచి 100 శాతం చార్జింగ్ అయ్యేందుకు ఇవి కేవ‌లం 55 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే తీసుకుంటాయి.

రియ‌ల్‌మి ఎక్స్‌3, ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ స్పెసిఫికేష‌న్లు…

* 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌
* ఎక్స్‌3 – 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
* ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ – 8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* ఎక్స్‌3 – 64, 8, 12, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ – 64, 8, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* ఎక్స్‌3 – 16, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ – 32, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 30 వాట్ల డార్ట్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి ఎక్స్‌3, ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ ఫోన్లు గ్లేసియ‌ర్ బ్లూ, ఆర్కిటిక్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి. వీటి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

* రియ‌ల్‌మి ఎక్స్‌3 (6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌) ధ‌ర రూ.24,999
* రియ‌ల్‌మి ఎక్స్‌3 (8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌) ధ‌ర రూ.25,999
* రియ‌ల్‌మి ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ (8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌) ధ‌ర రూ.27,999
* రియ‌ల్‌మి ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ (12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌) ధ‌ర రూ.32,999

ఈ ఫోన్ల‌ను జూన్ 30వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో విక్ర‌యించ‌నున్నారు. ఇందుకు గాను ప్రీ బుకింగ్‌లు ఆయా సైట్ల‌లో ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డులు ఉన్న‌వారు ఈ ఫోన్ల‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news