హిందీ వ‌చ్చా.. మీకోస‌మే హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు..

-

హిందీ ట్రాన్స్‌లేట‌ర్ల‌కు ప‌లు కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. ఈ మేర‌కు ఎస్‌ఎస్‌సీ తాజాగా ఆయా విభాగాల్లో ఏర్ప‌డిన ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కింద మొత్తం 283 ఖాళీలు ఉన్నాయి. అభ్య‌ర్థులు ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

hindi translator posts in central government departments

ముఖ్య వివ‌రాలు…

* మొత్తం ఖాళీలు: 283 (గ్రూప్‌ బీ నాన్‌ గెజిటెడ్‌)
* పోస్టులవారీగా ఖాళీలు: జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌/ జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్ – 275, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్ ‌- 8
* అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత
* వయస్సు: 2021 జనవరి 1 నాటికి 18-30 ఏళ్ల‌ మధ్య ఉండాలి
* ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌‌ టెస్ట్‌ (రెండు పేపర్లు) ద్వారా
* పరీక్ష తేదీలు: పేపర్‌-1: 2020, అక్టోబర్‌ 6, పేపర్‌-2 (డిస్క్రిప్టివ్‌ పేపర్‌)-2021, జనవరి 31
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
* చివరితేదీ: జూలై 25

అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://ssc.nic.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news