భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిని కట్టడి చేయడానికి గానూ భారత ప్రభుత్వం అజిత్ దోవల్ ని రంగంలోకి దించిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అజిత్ దోవల్ నిన్న దాదాపు రెండు గంటల పాటు చైనా రక్షణ శాఖ ప్రతినిధితో ఫోన్ లో సంభాషించారు అని జాతీయ మీడియా నుంచి కథనాలు వస్తున్నాయి. ఆయన చైనాతో మాట్లాడటమే కాకుండా బలగాలను వెనక్కు తిరిగి తీసుకునే విధంగా ఒప్పించారు అని తెలుస్తుంది.
ఆ తర్వాతనే చైనీయులు తమ దళాలను మరియు గుడారాలను గల్వాన్‌లో 2 కిలోమీటర్ల మేర ఉపసంహరించుకోవడం ప్రారంభించారని జాతీయ మీడియా పేర్కొంది. మరికొన్ని రోజుల్లో, పిపి -14, పిపి -15, హాట్ స్ప్రింగ్స్ మరియు ఫింగర్ ప్రాంతంతో సహా ఇతర ఘర్షణ పాయింట్లలో బలగాలను పూర్తిగా చైనా వెనక్కు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. త్వరలోనే సమస్య స్నేహ పూర్వకంగా పరిష్కరించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు