జియో ఓ సంచలనం. నెట్వర్క్ రంగంలోనే పెను తుపానులా విరుచుకుపడింది జియో. దాని దెబ్బకు మిగితా నెట్వర్కులన్నీ కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే మిగితా నెట్వర్కులు కూడా కోలుకుంటున్నాయి. జియో దెబ్బకు అబ్బ అంటూ నడ్డివిరగ్గొట్టుకున్న ఐడియా, వొడాఫోన్.. ఇక లాభం లేదనుకొని కలిసిపోయాయి. ఒంటరి పోరాటం కాదు.. కలిసి పోరాడుదామని కంకణం కట్టుకున్నాయి. దానిలో భాగంగానే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ నుంచి ఈ బంపర్ ఆఫర్ వచ్చింది. రెండింట్లో ఏ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నవాళ్లయినా ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. 159 రూపాయలు పెట్టి రీచార్జ్ చేయించుకుంటే… 28 రోజుల వాలిడిటీతో 28 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను వినియోగించుకోవచ్చు. జియోలో ఇటువంటిదే రూ.149 ఆఫర్ ఉంది. 149 రూపాయలతో 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 1.5 జీబీ డెయిలీ డేటా లభిస్తుంది. కాకపోతే.. ఐడియా ప్లాన్ ప్రకారం.. ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.
ఐడియా బంపర్ ఆఫర్.. 159 రూపాయలకే 28 జీబీ డేటా!
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ఇంట్లో ఎంత వరకు నగదు ఉంచుకోవచ్చు
ఈరోజుల్లో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. చిన్న వస్తువు కొన్నా యూపీఐ ద్వారానే...
పెరిగిన EPFO వడ్డీ రేట్లు, ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయంటే
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల...
పీఎం-కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ చేస్తారు..?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 16వ విడతను ఫిబ్రవరి 28న...