ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రధాన కారణం అదే : అమిత్ షా

-

ధర్మవరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలకు టీడీపీ, జనసేన ఏవిధంగా పోరాడుతుందో. వారి పోరాటానికి మద్దతు తెలిపిందేందుకు వచ్చాను. దేశమంతటా లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో మాత్రం లోక్ సభతో పాటు అసెంబ్లీ కి కూడా జరుగుతున్నాయి.

ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మోడీకే అధిక ఓట్లు లభించాయని.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రధాన కారణం గూండాయిజాన్ని, నేరస్తులను అరికట్టేందుకు పొత్తు పెట్టుకున్నాం. అవినీతిని అంతం చేసేందుకు పొత్తు పెట్టుకున్నాం. ఏపీలో ల్యాండ్ మాఫియాను అరికట్టేందుకు పొత్తు పెట్టుకున్నాం.  తిరుపతిలోని వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను కాపాడేందుకు పొత్తు పెట్టుకున్నాం. తెలుగు భాషను పరిరక్షించేందుకు పొత్తు పెట్టుకున్నాం. జగన్ ప్రభుత్వంలో తెలుగు భాషను సమాప్తం చేసి.. ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను కాపాడుతామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కి జీవనాధారం లాంటిది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news