మోడీని మరోసారి ప్రధాని చేస్తే.. రెండేళ్లలో పోలవరం పూర్తి : అమిత్ షా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును సీఎంగా.. దేశంలో నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిగా చేస్తే.. రెండేళ్లలోనే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తానని పేర్కొన్నారు అమిత్ షా. ధర్మవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. పీఎం ఎవరు అవుతారో చెపప్పాలన్నారు. శరద్ పవార్ ను చేస్తారా..? లేక మమత, స్టాలిన్, రాహుల్ గాంధీని చేస్తారా..? అక్కడ పీఎం అభ్యర్థే లేరు.

మూడోసారి ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీనే. దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి నక్సలైట్లు, ఉగ్రవాదులను అరికట్టడానికి మోడీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. ధర్మవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ తనకు మంచి మిత్రుడు అని.. కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో కూటమిని గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలని.. మోడీని ప్రధానిని చేయాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణలో కమలం వికసించనుందని వెల్లడించారు అమిత్ షా. 

Read more RELATED
Recommended to you

Latest news