కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాాజాగా నిర్మల్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ కి ఒక సూచన చేస్తున్నా.. అయ్యా.. నీకు సినీ పరిశ్రమ వాళ్లు బాగా తెలుసు కదా. నువ్వు చీరకట్టుకుని ఆడపిల్లలా మంచిగా తయారై.. ఆర్టీసీ బస్సు ఎక్కు. నిన్ను టికెట్ కి డబ్బులు అడిగితే 6 గ్యారెంటీలు అమలు కానట్టే. టికెట్ అడగకపోతే మేము 6 గ్యారెంటీలు అమలు చేసినట్టేనని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈనెల 09వ తేదీ లోపు రైతు భరోసా నిధులను ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ లోపు ఒకే విడుతలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇప్పటికే 5 అమలు చేశామన్నారు.