పవన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారో తెలుసా?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేనానితో రైలు జర్ని’లో భాగంగా విజయవాడ నుంచి తుని వరకు జన్మభూమి ట్రైన్ లో ప్రయాణించారు. శుక్రవారం సాయంత్రానికి తుని చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పచ్చగా ఉండే గోదావరి జిల్లాలను కొంత మంది స్వార్థ రాజకీయాల కోసం వెచ్చగా మార్చుతున్నారన్నారు. 2014లో స్వార్థాన్ని ప‌క్క‌న‌బెట్టి రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోసం ఎన్నిక‌ల్లో పోటీ చేయలేదని దీనిని ఆసరగా చేసుకుని జనసేనా పార్టీని తోక పార్టీగా భావించారు తెదేపా నాయకులు.

అలాంటి నీచ రాజకీయాలు నేను చేయడానికి రాలేదు..  నిర్మాణాత్మక రాజకీయాలు చేయడానికి మాత్రమే నేను వచ్చానంటూ పేర్కొన్నారు. గతంలో జరిగిన తుని ఘ‌ట‌న రాష్ట్ర భ‌విష్య‌త్తులో బాధ క‌లిగించే సంఘ‌ట‌న  అన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు జ‌ర‌గ‌కుండా ఆపేందుకే వ‌చ్చాన‌ని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కూర్చిపైనే అందరికి యావ ఉందన్నారు. సమాజంలో సామాజిక మార్పు తీసుకురావాల‌ని ఏ ఒక్క నాయకుడు ఆలోచించడం లేదన్నారు. నాకు డబ్బు, పదవి పై ఎలాంటి ఆశ లేదు… నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news