పీహెచ్ డీ చేసి.. పొట్టకూటికి పండ్లు అమ్ముతున్నా ప్రొఫెసర్..!

-

ఇందోర్, పాట్నిపురా బజార్లో తోపుడు బండిపై పండ్లు విక్రయించే రైసా.. శాస్త్రవేత్త కావాలనుకుంది. అందుకే భౌతిక శాస్త్రం, మెటీరియల్ సైన్స్​లో పీహెచ్​డీ పూర్తి చేసింది. లాక్​డౌన్​ ముందు వరకు ఓ కళాశాలలో ప్రొఫెసర్​గానూ పని చేసింది. కానీ, అనివార్య కారణాల వల్ల రైసా ఉద్యోగం కోల్పోయింది.దీంతో, తండ్రి నడిపిన ఆ తోపుడు బండే తనకు జీవనాధారమైంది. మామిడి పండ్లు అమ్ముతూ.. కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంటికి వెళ్లాక క్యాన్సర్, కరోనాలను అంతం చేసే వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయోగాలు చేస్తోంది.

fruits
fruits

అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాపార కార్యకలాపాలపై కొన్ని నియమాలు అమలు చేస్తోంది ఇందోర్ పురపాలక సంస్థ. రోజు విడిచి రోజు దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. మున్సిపల్ ఆదేశాలు అతిక్రమించి.. రోజూ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం మొదలెట్టింది.ఈ క్రమంలోనే రైసా పండ్ల బండిని మార్కెట్ నుంచి తొలగించాలన్నారు అధికారులు. దీంతో రైసా అధికారులపై మండిపడింది. దేశ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుంటే.. చిరు వ్యాపారులను ఇలా వెళ్లగొట్టడమేంటని ప్రశ్నించింది.పండ్లు విక్రయిస్తున్నా డాక్టరేట్ స్థాయిలోనే ఆలోచన చేసి.. అధికారుల మనసు మార్చిన డాక్టర్ రైసా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news