ఎం.ఎల్.ఏ కళ్యాణ్ రామ్.. పదేళ్ల దాకా ఆ ఛాన్స్ లేదట

-

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎం.ఎల్.ఏ సినిమా వచ్చింది. ఆ సినిమాలానే రియల్ లైఫ్ లో కూడా ఫ్యూచర్ లో కళ్యాణ్ రామ్ కు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం ఉందని తెలుస్తుంది. అయితే అది ఎప్పుడు ఏంటన్నది మాత్రం చెప్పలేదు. కాని లేటెస్ట్ గా తెలంగాణాలో టిడిపి తరపున కళ్యాణ్ రామ్ ను ఎన్నికల బరిలో దించాలని చూస్తున్నారట. కూటమిగా ఏర్పడి టి.ఆర్.ఎస్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న టిడిపి, కాంగ్రెస్, టిజేఎస్ లలో జూబిలి హిల్స్ ఎం.ఎల్.ఏ సీటు టిడిపి కేటాయించారని తెలుస్తుంది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ ను అక్కడ నుండి పోటీ చేయించాలని అనుకున్నారు. ఈమేరకు బాబాయ్ తో సమాచారం అందించాడట బాబు.

కాని కళ్యాణ్ రామ్ మాత్రం అందుకు నిరాకరించాడట. ప్రస్తుతం ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పదేళ్ల దాకా సినిమాలే చేస్తానని చెప్పాడట. కళ్యాణ్ రాం ను నిలబెట్టి సానుభూతితో గెలిపించాలని చూసిన టిడిపి ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ రసూల్ ఎల్లోర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదే కాకుండా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణంలో కూడా మరో సినిమా చర్చల దశలో ఉందని తెలుస్తుంది. ఎం.ఎల్.ఏ సినిమా చేసిన కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ అయ్యేందుకు ప్రయత్నించక పోవడం ఆశ్చర్యకరం.

Read more RELATED
Recommended to you

Latest news