ఆ హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్ళి..?

-

ర‌విరాజా పినిశెట్టి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చి న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదిపినిశెట్టి. కంటెంట్ నచ్చితే చాలు.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏదైనా సరే, ఓకే చెప్పేస్తాడు. రంగస్థలం చిత్రంలో అశోక్ బాబుగా ఇండస్ట్రీని ఫిదా చేశాడు. అంతకు ముందు ‘నిన్ను కోరి’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన ఆది.. తన బాడీ ఫిట్‌నెస్, విలనిజంతో సరైనోడు సినిమాలో మెప్పించాడు. అయితే ఈ యువ హీరో పెళ్లి వార్త ఇపుడు కోలీవుడ్‌, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆదిపినిశెట్టి త‌న కోస్టార్ నిక్కీ గ‌ల్రానీని వివాహం చేసుకునేందుకు రెడీ అవుతోన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఆది తండ్రి రవిరాజా పుట్టినరోజు వేడుకల్లో వారి ఫ్యామిలీ ఫొటోలో నిక్కీ ఉండడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుండగా.. పరిస్థితులు నార్మల్ కాగానే పెళ్లి ఉంటుందని సమాచారం. కాగా, మ‌లుపు, మ‌ర‌క‌త‌మ‌ణి చిత్రాల్లో ఆది, నిక్కీ గ‌ల్రానీ క‌లిసి న‌టించారు. అయితే ప్ర‌స్తుతం దీనికి సంబంధించి ఆది, నిక్కీ గ‌ల్రానీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news