ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు : నర్రా శ్రీనివాస్

-

కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానాలు ఎన్ని సార్లు చెప్పినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డను మరోసారి ఎన్నికల కమిషనర్ గా నియమించేందుకు కార్యాచరణ చేపట్టలేదు. న్యాయస్థానాలు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చెయ్యగా ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్ నిమ్మగడ్డను మరోసారి ఎన్నికల కమిషనర్గా నియమించింది.

తాజాగా దీనిపై స్పందించిన లాయర్ శ్రీనివాస్.. నిమ్మగడ్డ ను మరోసారి ఎన్నికల కమిషనర్ గా నియమించడం హర్షించదగ్గ విషయం అంటూ తెలిపారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది అని.. దీంతో ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ కేసులో వెనక్కి తగ్గక తప్పలేదు అంటు శ్రీనివాస్ పేర్కొన్నారు. అదేదో ముందే చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం తీరు వల్ల కోర్టు ఆదేశాలను అమలు చేయాలని మళ్లీ కోర్టులే కలుగజేసుకుని చెప్పే పరిస్థితి వచ్చింది అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news