3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో 3 రాజధానులపై కాకుండా ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలనే అంశంపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. రాజధాని కోసం 3 వేల ఎకరాలు చాలని టీడీపీ హయాంలో కూడా తాము చెప్పామని పవన్ తెలిపారు.
ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/EiNYVVkeDj
— JanaSena Party (@JanaSenaParty) July 31, 2020
కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుండా 33వేల ఎకరాలు సేకరించిందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అందుకు మద్దతు తెలిపిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అప్పుడూ, ఇప్పుడూ రైతుల సమస్యల గురించి ప్రశ్నించింది జనసేన మాత్రమేనని పవన్ అన్నారు. ఇక ఈ మూడు రాజధానుల వ్యవహారంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని పవన్ కళ్యాణ్ అన్నారు.