రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీలను మరిన్ని ఏర్పాటు చేయడంలో పోటీబడాలే తప్ప… ఉన్న సీఆర్డీఏ రద్దు చేయడం అభివృద్ది కాదని టిడిపి నేత యనమల అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సిపి పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.
అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందా? అని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు నిలదీశారు. మూడు ప్రాంతాలను ఫ్యాక్షనిస్టుల హస్తగతం చేయడమే వైఎస్ఆర్సిపి అభివృద్ధి అని దుయ్యబట్టారు. స్థానికుల ఆస్తిపాస్తులన్నీ దోచి భూ కబ్జాదారులకు కట్టబెట్టడమే వైఎస్ఆర్సిపి చేసేదని ఆరోపించారు.
రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయడంలో పోటీపడాలే తప్ప…. ఉన్న సీఆర్డీఏ లను రద్దు చేయడం కాదని అభిప్రాయపడ్డారు. సొంత బాధ్యతలే తప్ప సామాజిక బాధ్యత లేని సీఎంగా చరిత్రలో జగన్మోహన్‌రెడ్డి మిగిలిపోతారని ఆరోపించారు.ఇప్పటికే గవర్నర్ ఆమోదించిన రాజధాని వికేంద్రీకరణ ఈ విషయంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనసేన నాయకులు చర్చా వేదికను ఏర్పాటు చేశారు. భవిష్యత్ ప్రణాళికపై ఆ సమావేశంలో చర్చిస్తున్నారు.