వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు మరో కాంట్రవర్సీ మూవీకి తెర తీశాడు. తన తదుపరి చిత్రం ‘అల్లు’ అని ఆర్జీవీ ప్రకటించాడు. ”అల్లు” అనే సినిమా ఓ పెద్ద స్టార్ హీరో కుటుంబానికి వెనుక నుండి ఓ బామ్మర్ది ఏమి చేసాడు అనే ఫిక్షనల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనుంది.. ఆ స్టార్ హీరో “జన రాజ్యం” పార్టీని ప్రకటించిన తర్వాత స్టోరీ మొదలవుతుందని చెప్పుకొచ్చాడు.
తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు.
— Ram Gopal Varma (@RGVzoomin) August 2, 2020
వర్మ ఇంకా ఈ సినిమా గురించి చెప్తూ.. అల్లు అనే టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ అల్లు తూ వుంటాడు. ‘తనకు మంచి జరగాలంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలంటే ప్లాన్ అల్లు.. అనే స్ట్రాటజీతో ప్లాన్‌ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి అల్లుడును కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ ఉంటాడు. అందరితో తనను ‘ఆహా’ అనిపించుకోడానికి తనకు కావాల్సిన వాళ్లకే మంచి జరిగేలా చెప్పి, ప్లాన్‌ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ అల్లు’ అని చెప్పుకొచ్చారు.
“అల్లు" will have characters called
A Aaravind
K Chiraaanjeevi
Prawan Kalyan
A Aaarjun
A Sheeresh
K R Chraran
N Baebu
and etc etc
— Ram Gopal Varma (@RGVzoomin) August 2, 2020
ఈ చిత్రంలో ఆరవింద్, చిర్రంజీవి, ప్రవన్ కల్యాణ్, ఆర్జున్, శీరీష్, కె.ఆర్.చరణ్, ఎన్.బీబు తదితర పాత్రలుంటాయని కూడా వర్మ తెలిపారు. ఈ సినిమా కూడా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో రాబోతుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.